Ankitha: ఆ మూవీ హిట్ అయి ఉంటే ఇండస్ట్రీలో ఉండేదాన్ని..‘సింహాద్రి’ హీరోయిన్ అంకిత వ్యాఖ్య

Actor ankitha talks about her career in recent interview
  • ‘విజయేంద్ర వర్మ’ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నానన్న అంకిత
  • సక్సెస్ ఉంటేనే కెరీర్ ముందుకు సాగుతుందని వెల్లడి
  • 2009లో సినీరంగానికి దూరమైన అంకిత
  • 2016లో వివాహం, ప్రస్తుతం భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్న నటి
‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి అంకిత. తొలి సినిమాతోనే ఆమె ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. ఆ తరువాత ‘ధనలక్ష్మి.. ఐ లవ్ యూ’, ‘ప్రేమలో పావని కల్యాణ్’ చిత్రాలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అంకిత్ కెరీర్‌లో సింహాద్రి ఓ బంపర్ హిట్. ఆ తరువాత అంకిత టాప్ హీరోయిన్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగకపోగా చివరకు ఆమె సినీరంగానికే దూరమైంది. నాటి పరిస్థితులు, తన కెరీర్ గురించి ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. 

‘‘విజయేంద్ర వర్మ సినిమాపై నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ చిత్రం హిట్ అయి ఉంటే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్ని. చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే కెరీర్ ముందుకు సాగుతుంది’’ అని ఆమె వ్యాఖ్యానించింది. 2004లో ‘విజయేంద్ర వర్మ’ తరువాత ఆమె నవదీప్ సరసన ‘మనసు మాట వినదు’, గోపిచంద్ నటించిన ‘రారాజు’లో నటించింది. రవితేజ్ హీరోగా రూపొందిన ‘ఖతర్నాక్’ సినిమాలోనూ ఓ స్పెషల్ సాంగ్‌లో తళుక్కుమన్న ఆమె 2009 నుంచి సినీ ఇండస్ట్రీకి దూరమైంది. 

అంకిత 2016లో విశాల్ జగపతి అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. ఆ తరువాత వారు అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు అబ్బాయిలు.
Ankitha
Simhadri
Junior NTR

More Telugu News