seethakka: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాల పంపిణీ

  • పోడు భూముల విషయంలో అటవీ అధికారులు, గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం
  • అర్హులైన అడవి బిడ్డలకు పోడు పట్టాలివ్వాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం
  • ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలో సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టా అందజేత
MLA Seethakka parents gets Podu lands pass book

కాంగ్రెస్ నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు అందించారు. రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ములుగు జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు పోడు భూమి పట్టాలను తహసీల్దార్ అందించారు.

పోడు భూముల విషయంలో అటవీ అధికారులు, గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తోన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కార మార్గాన్ని కనుగొంది. అర్హులైన అడవి బిడ్డలకు పోడు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. అటవీ భూములపై హక్కుల కోసం ఎదురు చూస్తున్న గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ గత నెల చివరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. తెలంగాణవ్యాప్తంగా 1,15,146 మంది గిరిజనులకు 4,06,369 ఎకరాలపై హక్కు పట్టాలు అందజేయాలని నిర్ణయించారు. కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో జూన్ 30న పోడు పట్టాల కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించారు.

More Telugu News