Bard: హిందీ సహా అనేక ప్రపంచ భాషల్లో గూగుల్ 'బార్డ్'

  • చాట్ జీపీటీ స్ఫూర్తితో బార్డ్ ను తీసుకువచ్చిన గూగుల్
  • హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్, జర్మన్ భాషల్లోనూ బార్డ్
  • మొత్తం 40 భాషల్లో బార్డ్ సేవలు
Google bring Bard in Hindi and some more world languages

చాట్ జీపీటీ పుణ్యమా అని కృత్రిమ మేధ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. చాట్ జీపీటీ స్ఫూర్తిగా అనేక ఏఐ టూల్స్ రంగప్రవేశం చేశాయి. వాటిలో గూగుల్ బార్డ్ ఒకటి. బార్డ్ ఇప్పుడు హిందీతో పాటు అనేక ప్రపంచ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 

యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గూగుల్ తన ఏఐ అసిస్టెంట్ బార్డ్ ను హిందీ, చైనీస్, జర్మన్, అరబిక్, స్పానిష్ భాషల్లోనూ ఆవిష్కరించింది. తాజా నిర్ణయంతో బార్డ్ బ్రెజిల్ లోనూ, యావత్ యూరప్ ఖండంలోనూ పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఇకపై బార్డ్ అత్యధిక సంఖ్యలో ప్రజలు మాట్లాడే 40 భాషల్లో తన సేవలు అందించనుంది. 

దీనిపై గూగుల్ నిపుణుడు జాక్ క్రాస్జిక్ స్పందించారు. కాలానుగుణంగా తాము బార్డ్ ను మరిన్ని భాషలకు, తద్వారా మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నామని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్గదర్శకాలే దిక్సూచిగా తమ పయనం కొనసాగుతుందని, ఫీడ్ బ్యాక్ ను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని, యూజర్ల డేటా, ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని క్రాస్జిక్ స్పష్టం చేశారు.

More Telugu News