suchitra: దర్శకుడు రాత్రి ఉండమన్నప్పుడు కన్నీళ్లు వచ్చాయి: బాలీవుడ్ నటి, గాయని సుచిత్ర కృష్ణమూర్తి

Suchitra Krishnamoorthi Recalls Casting Couch Experience
  • క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు చెప్పిన సుచిత్రా కృష్ణమూర్తి
  • ఓ దర్శకుడు తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని వెల్లడి
  • హోటల్ నుండి రేపు ఉదయం ఇంటి వద్ద దింపుతానని చెప్పిన దర్శకుడు
  • వెంటనే అక్కడ నుండి పరుగెత్తుకొని వచ్చానన్న నటి
నటిగా తాను క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నానని ప్రముఖ నటి, గాయని సుచిత్రా కృష్ణమూర్తి అన్నారు. గతంలో ఓ దర్శకుడు తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని, దీంతో తాను ఏడ్చేశానని చెప్పారు. ప్రాజెక్ట్ సమావేశాల కోసం అప్పుడు దర్శకులను హోటళ్లలో కలవడం సహజమేనని, ఏ సినిమాకు సంబంధించిన సమావేశాలు అయినా దాదాపు హోటల్స్ లోనే ఉండేవన్నారు. ఓ సినిమాకు సంబంధించి తాను కూడా ఓ దర్శకుడిని హోటల్ కు వెళ్లి కలిశానని, మొదట ప్రాజెక్టు గురించి చర్చించుకున్నామని చెప్పారు.

ఆ తర్వాత మీకు మీ నాన్న అంటే ఇష్టమా? అమ్మ అంటే ఇష్టమా? అని సదరు దర్శకుడు అడిగారని, దానికి తాను నాకు మా నాన్న అంటే ఇష్టమని చెప్పానని తెలిపారు. దానికి సదరు దర్శకుడు స్పందిస్తూ... మంచిదని, మీ నాన్నకు ఫోన్ చేసి రేపు ఉదయం నేను మిమ్మల్ని ఇంటి వద్ద దింపుతానని చెప్పండని తనతో అన్నాడని, ఆ మాటలు మాట్లాడటంతో తనకు కన్నీళ్లు వచ్చాయన్నారు. ఆ తర్వాత తాను అక్కడి నుండి పరుగెత్తుకొని వచ్చానన్నారు. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు మారినట్లు తెలిపారు.
suchitra
Casting Couch
director

More Telugu News