Narendra Modi: ప్యారిస్‌లో అడుగు పెట్టిన ప్రధాని మోదీ

PM Modi receives ceremonial welcome as he arrives in Paris
  • భారత ప్రధానికి ఫ్రాన్స్‌లో ఘన స్వాగతం
  • రేపు బాస్టిల్ డే వేడుకలో పాల్గొని గౌరవ వందనం స్వీకరించనున్న మోదీ
  • ప్యారిస్ లో అడుగు పెట్టానంటూ మోదీ ట్వీట్
రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్యారిస్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్ బోర్న్ స్వాగతం పలికారు. ప్యారిస్ లోని ప్రవాస భారతీయులు మోదీకి త్రివర్ణ పతాకాలతో స్వాగతం పలికారు. మోదీ రేపు బాస్టిల్ డే వేడుకలో పాల్గొని, గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఆ తర్వాత ప్యారిస్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ తో భేటీ కానున్నారు. ఫ్రాన్స్ ప్రధానితో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రక్షణ ఒప్పందాలపై చర్చించనున్నారు.

'ప్యారిస్ లో అడుగుపెట్టాను. ఈ పర్యటన ద్వారా భారత్-ఫ్రాన్స్ సహకారాన్ని పెంపొందించుకోవాలని ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నా కార్యక్రమాలలో భాగంగా భారతీయులతోను భేటీ అవుతున్నాను' అని ప్యారిస్ లో దిగిన అనంతరం మోదీ ట్వీట్ చేశారు.
Narendra Modi
france
BJP
India

More Telugu News