ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేత
- మావోయిస్టు నేత మడకం దేవాను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు
- మడకం దేవా తలపై రూ.5 లక్షల రివార్డు
- మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చిన ఏపీ డీజీపీ
స్వయంగా లొంగిపోయిన నేపథ్యంలో, లొంగుబాటు-పునరావాసం పథకంలో భాగంగా రూ.5 లక్షల రివార్డుతో పాటు అతనికి అనేక సదుపాయాలు కల్పించనున్నారు.
దీనిపై ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు-పునరావాసం పథకంలో భాగంగా సదుపాయాలను అందుకుని ప్రశాంత జీవనం గడపాలని సూచించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.