Mohan Babu: షాద్ నగర్ లో తనను చుట్టుముట్టిన మీడియాపై మోహన్ బాబు ఆగ్రహం

Mohan Babu fires on Media at Shadnagar sub registrar office
  • సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన మోహన్ బాబు
  • కవరేజికి ప్రయత్నించిన మీడియా ప్రతినిధులు
  • మైక్ లోగోలు లాక్కోండి అంటూ బౌన్సర్లకు సూచించిన మోహన్ బాబు!
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు మీడియాపై చిందులు తొక్కారు. ఆయన ఇవాళ షాద్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. మోహన్ బాబు వచ్చిన విషయం తెలియడంతో మీడియా ప్రతినిధులు అక్కడికి తరలివచ్చారు. మోహన్ బాబును మాట్లాడించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఫొటోలు, వీడియోలు తీస్తుండడంతో అక్కడ హడావిడి నెలకొంది. 

ఈ నేపథ్యంలో, మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధి లేదా మీకు అంటూ అసహనం వ్యక్తం చేశారు. మైక్ లోగోలు లాగేయండి అంటూ తన బౌన్సర్లకు పురమాయించారు. ఈ మేరకు ఓ వీడియోలో మోహన్ బాబు ఆగ్రహావేశాలు స్పష్టంగా కనిపించాయి. కాగా, మోహన్ బాబు ఓ ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనుల కోసం షాద్ నగర్ వచ్చినట్టు తెలుస్తోంది.
Mohan Babu
Media
Sub Registrar Office
Shadnagar
Hyderabad
Tollywood

More Telugu News