YS Sharmila: టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న షర్మిల కొడుకు?

YS Sharmila son Raja Reddy to enter in to tollywood as hero
  • వైఎస్ జయంతికి ఇడుపులపాయకు వచ్చిన షర్మిల కొడుకు రాజారెడ్డి
  • మంచి హైట్, పర్సనాలిటీతో అందరినీ ఆకర్షించిన షర్మిల వారసుడు
  • రాజారెడ్డిని టాలీవుడ్ లో లాంచ్ చేయబోతున్నట్టు ప్రచారం
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కొడుకు రాజారెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. మొన్న వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు తన తల్లితో పాటు ఇడుపులపాయకు వచ్చిన రాజారెడ్డి అందరి దృష్టిని ఆకర్షించాడు. మంచి హైట్, కండలు తిరిగిన శరీరంతో అందరినీ ఆకట్టుకున్నాడు. 

మరోవైపు రాజారెడ్డి గురించి ఒక టాక్ వినిపిస్తోంది. రాజారెడ్డిని సినిమాల్లో లాంచ్ చేసే పనుల్లో షర్మిల ఉన్నారనే వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని... పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారని చెపుతున్నారు. ఈ చిత్రం యాక్షన్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ డ్రామా అని కూడా అంటున్నారు. అయితే దీని గురించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. 

YS Sharmila
YSRTP
Son
Raja Reddy
Tollywood

More Telugu News