Adinarayana Reddy: బీజేపీ, టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉంటుంది: ఆదినారాయణ రెడ్డి

BJP leader Adinarayana Reddy speaks about alliances in AP
  • పొత్తు గురించి బీజేపీ కేంద్ర నాయకత్వం సంకేతాలను ఇచ్చిందన్న ఆదినారాయణ రెడ్డి
  • సంకేతాలు లేకపోతే తాను మాట్లాడనని వ్యాఖ్య
  • జగన్ కు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదని వెల్లడి
వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల మధ్య పొత్తులపై ఉత్కంఠ నెలకొంది. ఏయే పార్టీలు కలిసి పని చేస్తాయనే విషయంపై పెద్ద చర్చే నడుస్తోంది. తాజాగా బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ... ఏపీలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మూడు పార్టీలు కలుస్తాయని బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సంకేతాలను ఇచ్చిందని చెప్పారు. కేంద్రం సంకేతాలు లేకుంటే తాను ఎందుకు మాట్లాడతానని అన్నారు. పొత్తుల విషయంలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ కు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదని... సీబీఐ కేసుల నుంచి ఆయనను బీజేపీ కాపాడుతోందనే ప్రచారంలో నిజం లేదని చెప్పారు.
Adinarayana Reddy
BJP
Telugudesam
YSRCP

More Telugu News