హాయ్ నాన్న.. నాని 30వ సినిమా టైటిల్‌ ఇదే!

Nani and Mrunal Thakur Next titled as Hi Nanna
  • కొత్త దర్శకుడు శౌర్యువ్‌తో నాని సినిమా
  • హీరోయిన్‌గా నటిస్తున్న మృణాళ్ ఠాకూర్
  • డిసెంబర్ 21న ఐదు భాషల్లో విడుదల
టాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని ‘దసరా’ చిత్రంతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. వరుస సినిమాలతో బిజీగా ఉండే నాని ప్రస్తుతం తన 30వ చిత్రంలో నటిస్తున్నాడు. శౌర్యువ్‌ అనే కొత్త దర్శకుడితో ఈ సినిమా చేస్తున్నాడు. సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి హాయ్‌ నాన్నఅనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. సినిమా ఫస్ట్ లుక్ తో పాటు గ్లింప్స్ ను కూడా ఈ రోజు విడుదల చేశారు. గ్లింప్స్ చూస్తుంటే తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. 

ఈ చిత్రంలో నాని కూతురుగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ నిర్మిస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన హెశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ సంగీతం అందిస్తున్నాడు. దసరా మాదిరిగా ఈ చిత్రాన్ని కూడా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది.
Go Back to Shorts
Nani
30
MrunalThakur
Hi Nanna
movie
pan india

More Telugu News