Shah Rukh Khan: ‘జవాన్’లో చర్చనీయాంశంగా షారుక్ గుండుపై పచ్చబొట్టు.. ఏం రాసి ఉందంటే..!

Tattoo on Shah Rukh Khan head in bald look in Jawan trailer decoded
  • అట్లీ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్
  • హీరోయిన్‌గా నటించిన నయనతార
  • సెప్టెంబర్ 7న విడుదల కానున్న చిత్రం
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘జవాన్‌’ చిత్రం కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. దాంతో నార్త్‌తో పాటు సౌత్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్ లో మునుపెన్నడూ చూడని షారుఖ్ ఖాన్ లుక్స్ ఆసక్తిగా మారాయి. షారుఖ్ తొలిసారి గుండుతో కనిపిస్తున్నాడు. ఆ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 

ఇక, షారుక్ తలపై ఓ పచ్చబొట్టు (టాటూ) కూడా కనిపించడంతో దానిపై చర్చ మొదలైంది. ఎడమ చెవి పైభాగంలో సంస్కృతంలో రాసి ఉన్న అక్షరాలను కొందరు డీ కోడ్ చేశారు. షారుఖ్ తలపై 'మా జగత్ జనని' అని రాసి ఉంది. కాగా, జవాన్ చిత్రం సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా, ప్రియమణి కూడా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు. దీపికా పదుకొణే అతిథి పాత్రలో కనిపించనుంది.
Shah Rukh Khan
head
Jawan
tatoo

More Telugu News