Team India: కట్టుదిట్టంగా భారత్ బౌలింగ్.. 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులతో ఆడుతున్న విండీస్

West Indies vs India Score
  • తొలుత తడబడిన భారత బౌలర్లు
  • రెండు వికెట్లు తీసిన అశ్విన్
  • 20వ ఓవర్లో వికెట్ తీసిన శార్దూల్
డొమినికా వేదికగా భారత్ - వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో విండీస్ 25 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడుతోంది. భారత్ ప్రారంభంలో కాస్త తడబడినప్పటికీ ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి విండీస్ 29 పరుగులు చేసింది. కానీ ఒక్క వికెట్ పడలేదు. ఆ తర్వాత కాసేపటికే అశ్విన్ బౌలింగ్ లో చందర్ పాల్ ఔటయ్యాడు. ఆ తర్వాత బ్రాత్ వైట్ కూడా అశ్విన్ బౌలింగ్ లోనే పెవిలియన్ కు చేరాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 20వ ఓవర్లో రీఫర్ అవుటయ్యాడు. విండీస్ 28 ఓవర్లకు 68 పరుగులు చేసింది.
Team India
west indies
Cricket

More Telugu News