Andhra Pradesh: ఏపీ ఉద్యోగుల జీతాల సవరణకు కొత్త పీఆర్‌సీ

  • పీఆర్‌సీ చైర్మన్‌గా డా. మన్మోహన్ సింగ్‌ను నియమిస్తూ జీవో జారీ 
  • ఏడాది లోపు నివేదిక ఇవ్వాలంటూ ఆదేశం
  • ప్రభుత్వం విధించిన కాలపరిమితిపై ఉద్యోగుల్లో అసంతృప్తి
AP govt to constitute prc for employees pay scale revision

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాల సవరణకు ప్రభుత్వం త్వరలో కొత్త పీఆర్‌సీ(12వ కమిటీ) తీసుకురానుంది. ఈ పే రివిజన్ కమిటీకి చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను నియమించింది. జీతాల సవరణపై సంవత్సరంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది. జీతభత్యాల విషయమై కమిటీ త్వరలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలతో చర్చించనుంది. 

కాగా, పీఆర్‌సీ నివేదిక సంవత్సరంలోగా ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.

More Telugu News