Taneti Vanita: పవన్ కల్యాణ్ వద్ద ఆధారాలు ఉంటే బయటపెట్టాలి: హోంమంత్రి తానేటి వనిత

Pawan Kalyan should reveal evidence says Taneti Vanitha
  • వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి వనిత 
  • వాలంటీర్లు కరోనా కాలంలో సేవ చేశారని వెల్లడి
  • పవన్ తో చంద్రబాబు మాట్లాడిస్తున్నారన్న మరో మంత్రి చెల్లుబోయిన
వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలను ఏపీ హోంమంత్రి తానేటి వనిత ఖండించారు. జనసేనాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వుమెన్ ట్రాఫికింగ్‌పై పవన్ వద్ద ఆధారాలు ఉంటే... కేంద్ర నిఘా సమాచారం ఉంటే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో వాలంటీర్లు ఎనలేని సేవలు చేశారన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేశారని కితాబునిచ్చారు.

మరోపక్క, మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండు జిల్లాలకే పరిమితం చేశారని విమర్శలు గుప్పించారు. వాలంటీర్లపై పవన్ నీచ ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. పవన్ ను ట్రాప్ చేసి చంద్రబాబు వాలంటీర్లపై అలా మాట్లాడించారన్నారు. గత ఎన్నికల్లో జనసేన ఒక్క సీటూ గెలవలేదని, రాపాక వరప్రసాద్ కు మంచి పేరు ఉండటం వల్లే గెలిచాడన్నారు.
Taneti Vanita
Pawan Kalyan
Janasena
YSRCP

More Telugu News