Santhosh Sobhan: ప్రియదర్శి చెప్పిన 'ప్రేమ్ కుమార్ కథ'

  • 'ప్రేమ్ కుమార్'గా సంతోష్ శోభన్
  • కథానాయికలుగా రాశి సింగ్ - రుచిత 
  • దర్శకుడిగా అభిషేక్ మహర్షి పరిచయం 
  • ఈ నెల 18వ తేదీన రానున్న ట్రైలర్ 
Prem kumar katha Movie Update

సంతోష్ శోభన్ హీరోగా 'ప్రేమ్ కుమార్ కథ' సినిమా రూపొందింది. శివప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమాతో, అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ కథ .. సినిమా కథ నేపథ్యంలో నడుస్తుంది. అంటే తెరపై సంతోష్ శోభన్ హీరో అయితే, సినిమా కథ నేపథ్యంలో వచ్చే హీరో కృష్ణ చైతన్య. 

ఈ ఇద్దరికీ ఎంతమాత్రం పడదు. రాశి సింగ్ - రుచితా సాధినేని అనే నాయికలు కూడా అందుకు ఒక కారణం. కృష్ణ చైతన్యను తన పాలిట విలన్ గా సంతోష్ శోభన్ భావిస్తూ ఉంటాడు. మొత్తంగా చూసుకుంటే ఇది రెండు జంటల ప్రేమ ప్రయాణం. ఈ విషయాన్ని కాస్త కన్ఫ్యుజింగ్ గా ప్రియదర్శితో దుర్యోధనుడి స్టైల్లో చెప్పించారు.

అంతా అయోమయంగా ఉందని శకుని (సీఎస్ ఆర్) వాయిస్ తో చెప్పించి, 'అయితే ఈ నెల 18వ తేదీన ట్రైలర్ రిలీజ్ అయ్యేవరకూ వెయిట్ చేయండి' అంటూ సస్పెన్స్ లో పెట్టారు. పీటలపై పెళ్లి ఆగిపోయినప్పుడు ఆ పెళ్లి కొడుకు ఏం చేశాడు" అనే అంశంపై ఈ కథ నడుస్తుంది. అనంత్ శ్రీకర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News