Rajanikanth: రజనీకి వీడ్కోలు చెప్పిన 'లాల్ సలామ్' టీమ్!

  • ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో 'లాల్ సలామ్'
  • ప్రధానమైన పాత్రల్లో విష్ణు విశాల్ - విక్రాంత్ సంతోష్ 
  • మొయిదీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్
  • మాఫియాను టచ్ చేస్తూ సాగే క్రికెట్ నేపథ్యంలోని కథ

Lal Salaam Movie Update

'లాల్ సలాం' .. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు విశాల్ - విక్రాంత్ సంతోష్ ప్రధానమైన పాత్రలుగా, క్రికెట్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. క్రికెట్ నేపథ్యంలో జరిగే గొడవలు .. మాఫియాతో లింకుల చుట్టూ అల్లుకున్న ఈ కథ ఆసక్తికరంగా సాగుతుంది. 

ఈ సినిమాలో రజనీకాంత్ 'మొయిదీన్ భాయ్' గా మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నారు. 'బాషా' నుంచి 'కాలా' వరకూ ఆయన చాలానే మాఫియా డాన్ పాత్రలను చేసినప్పటికీ, ఈ సినిమాలోని పాత్ర అందుకు పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఆయన సోదరి పాత్రలో జీవిత రాజశేఖర్ కనిపించనున్నారు. 

ఈ సినిమాలో రజనీ పాత్రకి సంబంధించిన పోర్షన్ షూటింగు పూర్తయింది. అందువలన ఈ సినిమా టీమ్ అంతా కలిసి ఆయనకి హ్యాపీగా వీడ్కోలు పలికారు. లైకా ప్రొడక్షన్స్ - రెడ్ జెయింట్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇక రజనీ తాజా చిత్రంగా రూపొందిన 'జైలర్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News