Rajya Sabha Elections: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యి!

BJP announces candidates for Rajya Sabha elections
  • ఈ నెల 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
  • గుజరాత్ నుంచి బాబూభాయ్, కేశ్రీదేవ్ సిన్హ్ కు అవకాశం
  • బెంగాల్ నుంచి అనంత మహారాజ్ కు ఛాన్స్
రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా మరో మూడు స్థానాలకు గాను బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. గుజరాత్ నుంచి ఇద్దరు, పశ్చిమ బెంగాల్ నుంచి ఒకరిని తమ అభ్యర్థులుగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ నుంచి అనంత మహారాజ్, గుజరాత్ నుంచి బాబూభాయ్ జేసంగ్ భాయ్ దేశాయ్, కేశ్రీదేవ్ సిన్హ్ జాలాకు అవకాశం కల్పించింది. 

ఈ నెల 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ లో 6 స్థానాలు, గుజరాత్ లో 3, గోవాలో 1 స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇప్పటికే గుజరాత్ నుంచి బీజేపీ తరపున నామినేషన్ వేశారు. మరోవైపు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ అవకాశం దక్కక పోవడం గమనార్హం. 

Rajya Sabha Elections
BJP
Candidates
Gujarat
West Bengal

More Telugu News