Nara Lokesh: జగన్ పాలన రైతుల పాలిట శాపంలా మారింది: నారా లోకేశ్

  • కావలి నియోజకవర్గంలో ముగిసిన లోకేశ్ యువగళం
  • కొత్తపల్లిలో రచ్చబండ
  • గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్న టీడీపీ అగ్రనేత
  • లోకేశ్ ను కలిసిన వివిధ గ్రామాల ప్రజలు
  • ఉదయగిరి నియోజకవర్గంలో ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర 
Nara Lokesh criticizes Jagan ruling

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రమంగళవారం సాయంత్రం కావలి నియోజకవర్గంలో పూర్తయి ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బొల్లినేని రామారావు, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు లోకేశ్ కు ఘనస్వాగతం పలికారు. 

అంతకుముందు కావలి నియోజకవర్గం కొత్తపల్లిలో లోకేశ్ రచ్చబండ నిర్వహించి గ్రామస్తులతో మాట్లాడారు. జగన్ పాలనలో కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నాని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరి రైతులకు పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

టీడీపీ హయాంలో రైతులకు రైతు రథాలు, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ పోషకాలు, ఇన్ పుట్ సబ్సిడీ అందించామని వెల్లడించారు. జగన్ పాలనలో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు.

 వివిధ గ్రామాల ప్రజలు తనను కలిసిన సందర్భంగా లోకేశ్ ఏమన్నారంటే...

  • జగన్మోహన్ రెడ్డి దొంగలముఠాకు అడ్డగోలు దోపిడీపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంపై లేదు. అరాచక పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు కల్లాలు ఏర్పాటు చేస్తాం. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజి, శ్మశానం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఇళ్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.
  • రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన రైతుల పాలిట శాపంగా మారింది. గత నాలుగేళ్లుగా రైతులు నష్టాలపాలయ్యారు. రైతు ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలిచింది. జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లో దేశంలోనే మొదటిస్థానంలో నిలిపాడు. 
  •  గ్రామీణాభివృద్ధి పూర్తిగా పడకేసింది. పంచాయతీలకు చెందిన రూ.9 వేల కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. పంచాయతీలకు సొంత డబ్బులు ఖర్చు పెట్టిన సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకువచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గ్రామంలో తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా ఇళ్లు నిర్మిస్తాం. గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
  • జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. టీడీపీ హయాంలో సాగు నీటి ప్రాజెక్టులపై రూ.68,294 కోట్లు ఖర్చు చేశాం. టీడీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక సోమశిల ఉత్తర కాలువ పనులు పూర్తిచేస్తాం. ఉదయగిరి నియోజకవర్గంలో గొలుసుకట్టు చెరువులకు నీరందించి సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తాం.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం – 2019.9 కి.మీ*

*ఈరోజు నడిచిన దూరం – 20.4 కి.మీ.*

*154వ రోజు పాదయాత్ర వివరాలు (12-7-2023):*

*ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా)*

ఉదయం

8.00 – చోడవరం శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.30 – రామానుజపురం క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

10.15 – కొమ్మిలో స్థానికులతో సమావేశం.

10.35 – సత్యవోలులో స్థానికులతో సమావేశం.

11.30 – సత్యవోలు అగ్రహారం స్థానికులతో సమావేశం.

మధ్యాహ్నం

12.50 – ఎర్రబాలెం క్రాస్ వద్ద భోజన విరామం.

సాయంత్రం

3.00 – ఎర్రబాలెం క్రాస్ వద్ద నుండి పాదయాత్ర ప్రారంభం.

3.45 – పార్లపల్లిలో స్థానికులతో మాటామంతీ.

5.45 – కొండాపురంలో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.

7.00 – కొండాపురం శివారు విడిది కేంద్రంలో బస.

******






More Telugu News