Botsa Satyanarayana: వాలంటీర్లపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు దురదృష్టకరం: మంత్రి బొత్స

Botsa opines on Pawan Kalyan comments about volunteers
  • వాలంటీర్ వ్యవస్థపై ధ్వజమెత్తిన పవన్ 
  • పవన్ రాజకీయనేత కాదన్న బొత్స
  • పవన్ కు దశ దిశ లేవని వ్యాఖ్య 
  • పవన్ కు లేఖ రాసిన వాలంటీర్లు
వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేస్తూ జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. వాలంటీర్ల గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం అని పేర్కొన్నారు. పవన్ రాజకీయ నేత కాదని, కేవలం సెలబ్రిటీ అని అన్నారు. ఒక దశ, దిశ లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని అభివర్ణించారు. పవన్ కు ఒక విధానం అంటూ లేదని, అన్నీ గాలివాటం మాటలేనని బొత్స విమర్శించారు.

అటు, ఏపీ వాలంటీర్లు పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. 'అయ్యా జల్సా రాయుడు గారూ' అంటూ ప్రారంభించి, పవన్ మూడో భార్య అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి వాస్తవాలు గుర్తించాలని పేర్కొన్నారు.
Botsa Satyanarayana
Pawan Kalyan
Volunteers
YSRCP
Janasena

More Telugu News