Supreme Court: అమరావతి రాజధాని కేసు విచారణ వాయిదా

  • డిసెంబర్ లో విచారిస్తామన్న ధర్మాసనం
  • అత్యవసర విచారణ సాధ్యం కాదని క్లారిటీ
  • నవంబర్ వరకు ఇతర కేసులు ఉన్నాయని వెల్లడి
Supreme Court adjourns hearing Amaravati capital petitions to December

అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లను డిసెంబర్ లో విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈమేరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ కేసును అత్యవసరంగా విచారించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఇతర రాజ్యాంగ ధర్మాసనాల కేసులు విచారించాల్సి ఉందని, నవంబర్ వరకూ ఈ కేసుల విచారణ జరుగుతుందని చెప్పింది.

ఈమేరకు మంగళవారం నాడు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును పరిశీలించి విచారణను డిసెంబర్ కు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యర్థనను మన్నించలేమని పేర్కొంది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాలపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఆరు నెలల్లో అమరావతి రాజధానిని నిర్మించాలని హైకోర్ట్ జారీ చేసిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం, ప్రతివాదులకు కోర్టు నోటీసులు ఇచ్చింది. గతంలో ఈ కేసు విచారించిన న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ పదవీ విరమణ చేశారు. దీంతో ఈ కేసు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేదిల బెంచ్ కు బదిలీ అయింది.

More Telugu News