Akshay Kumar: మహాకాళేశ్వరుడిగా అక్షయ్ కుమార్ .. 'ఓ మై గాడ్ 2' టీజర్ రిలీజ్!

  • అక్షయ్ కుమార్ నుంచి 'ఓ మై గాడ్ 2'
  • మహాకాళేశ్వరుడిగా కనిపించనున్న అక్షయ్ 
  • దర్శకత్వం వహించిన అమిత్ రాయ్ 
  • ఆగస్టు 11వ తేదీన సినిమా విడుదల

OMG Movie Teaser Released

ఆ మధ్య అక్షయ్ కుమార్ కథానాయకుడిగా చేసిన 'ఓ మై గాడ్' సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాలో శ్రీకృష్ణుడిగా అక్షయ్ కనిపించాడు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా 'ఓ మై గాడ్ 2' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ 'ఉజ్జయిని మహాకాళేశ్వరుడు'గా కనిపించనున్నాడు. 
 
రీసెంట్ గా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుని, మిగతా పనులను జరుపుకుంటోంది. అక్షయ్ కుమార్ - అశ్విన్ వర్దే కలిసి నిర్మించిన ఈ సినిమాకి, అమిత్ రాయ్ దర్శకత్వం వహించాడు. ' ఓ మై గాడ్' లో పరేశ్ రావెల్ ముఖ్యమైన పాత్రలో  కనిపిస్తే, ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. 

 కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. 'ఈశ్వరుడికి ఆస్తికుడు .. నాస్తికుడు అనే భేదం లేదు .. ఆయన అందరినీ సమానంగానే చూస్తాడు .. శరణాగతి చేసినవారిని తప్పక రక్షిస్తాడు' అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందినట్టుగా తెలుస్తోంది. యామీ గౌతమ్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, ఆగస్టు 11వ తేదీన విడుదల చేయనున్నారు.


More Telugu News