Ashwin Babu: 'హిడింబ' రిలీజ్ డేట్ ఖరారు!

  • అశ్విన్ బాబు హీరోగా రూపొందిన 'హిడింబ'
  • ఆయన జోడీకట్టిన నందిత శ్వేత
  • డిఫరెంట్ కాన్సెప్ట్ ను టచ్ చేసిన దర్శకుడు 
  • ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల

Hidimba Release Date Confirmed

'జీనియస్' .. 'రాజుగారి గది' వంటి సినిమాలతో అశ్విన్ బాబు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'రాజుగారి గది 3' తరువాత ఆయన కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఆ తరువాత ఆయన చేసిన సినిమానే 'హిడింబ'.  గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకి, అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించాడు.

కొంతసేపటి క్రితం ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. యాక్షన్ సీన్ కి సంబంధించిన పోస్టర్ లో అశ్విన్ బాబు కనిపిస్తున్నాడు. 

ఈ సినిమాలో అశ్విన్ బాబు జోడీగా నందిత శ్వేత కనిపించనుంది. హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన సినిమాలలో నందిత విభిన్నమైన పాత్రలను పోషించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అశ్విన్ బాబు కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.

More Telugu News