Helicopter Missing: నేపాల్‌లో టేకాఫ్ అయిన కాసేపటికే అదృశ్యమైన హెలికాప్టర్

  • చాపర్‌లో పైలట్‌తోపాటు ఐదుగురు విదేశీయులు
  • సోలుకుంభ్ నుంచి ఖఠ్మాండు వెళ్తుండగా ఘటన
  • వెతికేందుకు బయలుదేరిన మరో హెలికాప్టర్
Chopper with 6 people on board missing in Nepal

ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్ అదృశ్యమైంది. నేపాల్‌లో జరిగిందీ ఘటన. మేనేజింగ్ ఎయిర్‌కు చెందిన హెలికాప్టర్ 9ఎన్-ఏఎంవీ (ఏఎస్ 50) సోలుకుంబు నుంచి ఖఠ్మాండు వెళ్తుండగా చాపర్ అదృశ్యమైంది. హెలికాప్టర్‌లో పైలట్‌తోపాటు ఐదుగురు విదేశీయులు ఉన్నారు. ఈ ఉదయం 10.12 గంటలకు అది రాడార్ నుంచి అదృశ్యమైంది. 

హెలికాప్టర్ అదృశ్యం కాగానే రంగంలోకి దిగిన అధికారులు దానిని వెతికేందుకు ఓ హెలికాప్టర్‌ను పంపారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన 15 నిమిషాలకే దానితో సంబంధాలు తెగిపోయాయని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వివరించింది.

More Telugu News