Telugudesam: విడదల రజనికి టీడీపీ నేత ప్రత్తిపాటి సెల్ఫీ ఛాలెంజ్!

TDP leader prathipati selfie challenge to Minister rajani
  • రజనికి వసూళ్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని ఆరోపణ
  • టీడీపీ చేసిన పనుల్లో 10 శాతమైనా వైసీపీ చేసిందా? అని ప్రశ్న
  • జగన్ బటన్ సీఎంగా నిలిచిపోయారని ఎద్దేవా
మంత్రి విడదల రజనిపై మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం నిప్పులు చెరిగారు. రజనికి వసూళ్లపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గంపై ఏమాత్రం లేదని ఆరోపించారు. టీడీపీ చేసిన పనుల్లో 10 శాతమైనా వైసీపీ చేసిందా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లలో రజని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. పసుమర్రు వంతెన, ఓగేరు వాగు వద్ద ప్రత్తిపాటి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... చిలకలూరిపేట సమస్యలు ఎక్కడివి అక్కడే ఉండిపోయాయన్నారు. టీడీపీ హయాంలో రూ.16 కోట్లతో ఎస్టీపీ పనులు చేపట్టామన్నారు. పసుమర్రు వంతెన కోసం చంద్రబాబు రూ.7.6 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు దాటినా ఈ వంతెనను పూర్తి చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గుత్తేదారుకు రూపాయి చెల్లించలేదని ఆరోపించారు. జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, బటన్ సీఎంగా నిలిచిపోయారని ఎద్దేవా చేశారు.
Telugudesam
Prathipati Pulla Rao
Vidadala Rajini
YSRCP

More Telugu News