Ponguleti Srinivas Reddy: జగన్‌ను కలవలేదు.. షర్మిల గురించి చర్చించలేదు: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

congress leader ponguleti srinivasreddy press meet
  • ఇటీవల జగన్‌ను పొంగులేటి కలిసినట్లు వార్తలు
  • తాను ఏపీ వెళ్లి సీఎంఓ అధికారులను మాత్రమే కలిశానన్న మాజీ ఎంపీ
  • కాంట్రాక్టుకు సంబంధించిన అంశాలు చర్చించినట్లు వెల్లడి
  • షర్మిల చేరికను కాంగ్రెస్ పెద్దలు చూసుకుంటారని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇటీవల ఆంధ్రప్రదేశ్ వెళ్లి సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసినట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌లో షర్మిల చేరిక విషయంపై చర్చించినట్లు ప్రచారం జరిగింది. 

దీనిపై తాజాగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఏపీ వెళ్లి సీఎంఓ అధికారులను మాత్రమే కలిశానని, జగన్‌ను మాత్రం కలవలేదని చెప్పారు. తన సంస్థకు చెందిన కాంట్రాక్ట్ సంబంధిత అంశాలను అధికారులతో చర్చించామన్నారు.

షర్మిల గురించి జగన్‌తో ఏమాత్రం చర్చించలేదని పొంగులేటి చెప్పారు. వైసీపీని తెలంగాణలో జగన్ వద్దనుకున్నారని అన్నారు. షర్మిల చేరికకు సంబంధించి పార్టీలో పెద్ద వాళ్ళు ఉన్నారని, వాళ్లే చూసుకుంటారని అన్నారు.
Ponguleti Srinivas Reddy
Jagan
Sharmila
YSRCP
Congress
Telangana

More Telugu News