Urination Incident: మధ్యప్రదేశ్ మూత్ర విసర్జన ఘటన.. బీజేపీని వీడిన సిధ్ జిల్లా ప్రధాన కార్యదర్శి

  • రాజీనామా చేసిన వివేక్  కోల్
  • సిధ్ ఎమ్మెల్యే కేదార్‌నాథ్ చర్యలతో విసిగిపోయానన్న నేత
  • గిరిజనుల భూమిని ఆక్రమించేస్తున్నారని ఆరోపణ 
  • ఇప్పుడాయన ప్రతినిధి గిరిజనుడిపై మూత్ర విసర్జన చేశాడని మండిపాటు
Madhya Pradesh BJP leader quits party over urination incident

మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన ఘటనకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిధ్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వివేక్ కోల్ పార్టీ నుంచి తప్పుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన రాజీనామా లేఖను జిల్లా బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మకు ఈమెయిల్ చేశారు. రాజీనామా గురించి పునరాలోచించమని పార్టీ  కోరిందని, అయితే ఇదే తన తుది నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు.

సిధ్ ఎమ్మెల్యే కేదార్‌నాథ్ శుక్లా చేష్టలతో రెండేళ్లుగా విసిగిపోయానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో గిరిజనుల భూమి ఆక్రమణలు, వారిపై దాడులు వంటివి తనను కలచివేశాయన్నారు. ఇప్పుడాయన ప్రతినిధిగా చెప్పుకుంటున్న పర్వేశ్ శుక్లా గిరిజనుడిపై మూత్ర విసర్జన చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో చుర్హత్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరపున పోటీ చేసిన వివేక్ కోల్ ఓటమి పాలయ్యారు.

More Telugu News