Trains: విజయవాడ డివిజన్‌లో భద్రతాపరమైన పనులు.. పలు రైళ్ల రద్దు

  • నేటి నుంచి 16వ తేదీ వరకు కొన్ని రైళ్లు పూర్తిగా రద్దు
  • మరికొన్ని రైళ్లు నిడదవోలు, భీమవరం టౌన్ మీదుగా మళ్లింపు
  • ప్రయాణికులు సహకరించాలన్న రైల్వే
Some trains are cancelled and some diverted

దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. నేటి నుంచి 16వ తేదీ వరకు గుంటూరు-విశాఖపట్టణం (17239), 11 నుంచి నుంచి 17వ తేదీ వరకు విశాఖపట్టణం-గుంటూరు(17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, 10వ తేదీ నుంచి 16 వరకు కాకినాడ-విశాఖ-కాకినాడ (17267-17268), రాజమహేంద్రవరం-విశాఖ-రాజమహేంద్రవరం (07466-07467) రైళ్లను రద్దుచేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

వీటితోపాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు పేర్కొన్నారు. ధన్‌బాద్-అళప్పుల (13351) బొకారో ఎక్స్‌ప్రెస్‌ను 11, 14, 15వ తేదీల్లో, హటియా-ఎస్ఎంబీ బెంగళూరు (12835) రైలును 11న, 14న టాటానగర్‌-ఎస్‌ఎంవీ బెంగళూరు (12889), 15న హటియా-ఎస్‌ఎంవీ బెంగళూరు (18637) రైళ్లను నిడదవోలు, భీమవరం టౌన్‌, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లించినట్టు వివరించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని త్రిపాఠి కోరారు.

More Telugu News