థాంక్యూ అన్నా... చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సీతక్క
- నేడు (జులై 9) ములుగు ఎమ్మెల్యే సీతక్క పుట్టినరోజు
- సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
- నా సోదరి అంటూ స్పందించిన చంద్రబాబుకు ఆత్మీయంగా బదులిచ్చిన సీతక్క
చంద్రబాబు ట్వీట్ పట్ల సీతక్క స్పందించారు. థాంక్యూ సో మచ్ అన్నా అంటూ ఆత్మీయంగా బదులిచ్చారు. కాగా, సీతక్క ఈసారి అమెరికాలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన ఆమె అభిమానుల ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సీతక్క యూట్యూబ్ లో పంచుకున్నారు.