Road Accident: శ్రీకాళహస్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురి దుర్మరణం

  • మిట్టకండ్రిగ వద్ద దుర్ఘటన
  • లారీని ఢీకొన్న కారు
  • మృతుల్లో ముగ్గురు మహిళలు
  • ఒకరికి తీవ్ర గాయాలు
  • తిరుమల నుంచి శ్రీకాళహస్తి వస్తుండగా ఘటన
Six people died in road mishap at Srikalahasti

తిరుపతి జిల్లాలో రహదారి రక్తమోడింది. శ్రీకాళహస్తి సమీపంలోని మిట్టకండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. వేగంగా వస్తున్న కారు... లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. కారులో తిరుమల నుంచి శ్రీకాళహస్తి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది.

More Telugu News