Naga Shaurya: ఈ టాలీవుడ్ కుర్ర హీరో జాతీయస్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు!

Naga Shaurya reveals he was a national basketball player in college days
  • వైవిధ్యమైన కథలతో ముందుకు వెళుతున్న నాగశౌర్య
  • తాజాగా రంగబలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ హీరో
  • ప్రమోషన్ ఈవెంట్లలో ఆసక్తికర అంశాలు వెల్లడి
జయాపజయాలతో సంబంధం లేకుండా, కథల ఎంపికలో ప్రత్యేకతను చాటుకుంటూ జాగ్రత్తగా కెరీర్ ను నిర్మించుకుంటున్న యువ హీరో నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, జ్యో అచ్యుతానంద, ఛలో వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో నాగశౌర్య ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. 

నాగశౌర్య నటించిన తాజా చిత్రం రంగబలి కూడా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ లో నాగశౌర్య పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. కాలేజీ రోజుల్లో తనలో మంచి క్రీడాకారుడు ఉన్నాడని వెల్లడించారు. 

తాను జాతీయస్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారుడ్నని తెలిపారు. నేషనల్ సెలెక్షన్స్ లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇద్దరు ఎంపికైతే, ఆ ఇద్దరిలో తాను ఒకడ్నని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో బాస్కెట్ బాల్ ఆడేందుకు శిక్షణ కూడా తీసుకున్నానని, కానీ కాలక్రమంలో బాస్కెట్ బాల్ వదిలేశానని నాగశౌర్య తెలిపారు. చాలాసార్లు నేషనల్ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్స్ లో ఆడానని, ఓ దశలో ఆటపై ఆసక్తిపోయిందని పేర్కొన్నారు.
Naga Shaurya
Basketball Player
National
Hero
Rangabali
Tollywood

More Telugu News