తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

  • వారాంతం కావడంతో భారీగా తరలివస్తున్న భక్తులు
  • తిరుమల కొండపై పెరిగిన రద్దీ
  • నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్
  • వెలుపలికి వచ్చిన క్యూ లైన్లు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువైంది. వారాంతం కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో క్యూ లైన్లు క్యూ కాంప్లెక్స్ దాటి వెలుపలికి వచ్చాయి. 

నిన్న స్వామివారిని 66,977 మంది దర్శించుకున్నారు. 33,020 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే తిరుమల వెంకన్నకు రూ.4.39 కోట్ల హుండీ ఆదాయం లభించింది.

Tirumala
Devotees
Darshan
TTD

More Telugu News