Rahul Gandhi: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు

  • మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యల కేసు
  • తనపై ఉన్న నేరారోపణలను కొట్టివేయాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో రాహుల్ పిటిషన్
  • కింది కోర్టు తీర్పును సస్పెండ్ చేయడానికి నిరాకరించిన హైకోర్టు
Set back for Rahul Gandhi in Modi surname case

పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెదురయింది. మోదీ ఇంటి పేరును కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారన్న పరువునష్టం కేసులో రాహుల్ కు సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన లోక్ సభ పదవిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు తీర్పును గుజరాత్ హైకోర్టులో రాహుల్ సవాల్ చేశారు. తనపై ఉన్న నేరారోపణలను కొట్టివేయాలని కోర్టును కోరారు. రాహుల్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... కింది కోర్టు తీర్పును సస్పెండ్ చేయడానికి నిరాకరించింది.

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో గుజరాత్ హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కు పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవాలి. ఈ కేసులో ఆయనకు ఊరట లభించకపోతే పార్లమెంటు ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి అవకాశం ఉండదు. మరోవైపు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News