Ramcharan: ‘థ్రెడ్స్‌’లో రామ్‌చరణ్ ఎంట్రీ.. మెగా సంబరంలో అభిమానులు!

  • మైక్రోబ్లాగింగ్ సైట్ థ్రెడ్స్‌లో నటుడు రామ్‌చరణ్ అధికారిక అకౌంట్
  • తమ స్టార్‌ హీరోతో కనెక్టయ్యేందుకు అభిమానులకు మరో వేదిక రెడీ
  • ‘థ్రెడ్స్‌’లో రామ్‌చరణ్‌ను ఫాలో అవడం ప్రారంభించిన ఫ్యాన్స్
Ram charans official threads account launched

మెటా సంస్థ ప్రారంభించిన కొత్త సోషల్ మీడియా వేదిక ‘థ్రెడ్స్’లో రామ్ చరణ్ కాలుపెట్టారు. @alwaysramcharan అకౌంట్‌తో అధికారంగా ఆయన రంగ ప్రవేశం చేశారు. దీంతో, తమ అభిమాన స్టార్‌తో కనెక్ట్ అయ్యేందుకు అభిమానులకు మరో వేదిక లభించినట్టైంది. విషయం తెలిసిన వెంటనే మెగా అభిమానులు రామ్‌చరణ్‌ను థ్రెడ్స్‌లోనూ ఫాలో అవడం ప్రారంభించారు. 

మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థ.. ట్విట్టర్‌కు పోటీగా థ్రెడ్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. థ్రెడ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే అరకోటికి పైగా నెటిజన్లు ఈ వేదికలో అకౌంట్స్ ప్రారంభించారు. థ్రెడ్స్ లక్ష్యాలు, విధివిధానాల విషయంలో జుకర్‌బర్గ్ తొలి నుంచి చాలా క్లియర్‌గా ఉన్నారనేది విశ్లేషకుల మాట. థ్రెడ్స్ ప్రారంభమైన నేపథ్యంలో జుకర్‌బర్గ్ ట్విట్టర్‌లోని తన అధికారిక అకౌంట్లో దాదాపు 11 ఏళ్ల తరువాత తొలిసారిగా ఓ పోస్ట్ పెట్టారు. రెండు స్పైడర్ మ్యాన్ ఫొటోలను షేర్ చేసిన ఆయన ఇది ట్విట్టర్‌ లాంటి అనుభవాన్నే ఇస్తుందని పరోక్షంగా చెప్పేశారు. 

మరోవైపు, మార్క్ జుకర్‌బర్గ్‌పై కేసు వేసేందుకు ట్విట్టర్ సిద్ధమవుతోంది. ట్విట్టర్ వ్యాపార సంబంధిత రహస్యాలు, మేథో సంపత్తి హక్కులను వినియోగించి థ్రెడ్స్ రూపొందించారంటూ ట్విట్టర్ తరపు న్యాయవాది మెటా సీఈఓ మార్గ్ జుకర్‌బర్గ్‌కు తాజాగా ఓ లేఖ రాశారు. ఇందుకోసం మెటా పలువురు మాజీ ట్విట్టర్ ఉద్యోగులను నియమించుకుందని కూడా ఆరోపించారు.

More Telugu News