Bandi Sanjay: బండి సంజయ్‌ని భుజాలపైకెత్తుకొని సీఎం... సీఎం అంటూ కార్యకర్తల నినాదాలు

Bandi Sanjay arrives at Shamshabad airport
  • గురువారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సంజయ్
  • వందలాది వాహనాల్లో ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు
  • సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయగా.. వారించిన బండి సంజయ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం బండి సంజయ్ గురువారం హైదరాబాద్ కు వచ్చారు. నాలుగు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేసిన ఆయన కీలక నేతలతో చర్చలు జరిపారు. అనంతరం ఈ రోజు ఢిల్లీ నుండి బయలుదేరి సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వందలాది వాహనాల్లో శంషాబాద్ విమానాశ్రయానికి తరలివచ్చిన కార్యకర్తలు బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు.  

పలువురు కార్యకర్తలు, అభిమానులు.. సంజయ్ ని భుజాల మీద ఎత్తుకొని నినాదాలు చేశారు. ఆయనకు శాలువాలు కప్పే సమయంలో జై శ్రీరామ్, సీం... సీఎం అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో అత్యుత్సాహం వద్దని, నినాదాలు చేయవద్దని సంజయ్ వారిని వారించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
Bandi Sanjay
Hyderabad
BJP

More Telugu News