Australia: తాళ్లతో కట్టి... ఆస్ట్రేలియాలో పంజాబీ యువతిని సజీవంగా పాతిపెట్టిన మాజీ ప్రియుడు

Indian student buried alive by ex boyfriend in act of revenge
  • నర్సింగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన జాస్మిన్ కౌర్
  • తారిక్ తో పరిచయం ప్రేమగా మారిన వైనం
  • ప్రియుడిలో మార్పు గమనించి దూరం జరిగిన జాస్మిన్
  • కళ్లకు గంతలు కట్టి, కేబుళ్లతో చుట్టి పాతిపెట్టడంతో ప్రాణాలు కోల్పోయిన యువతి
మాజీ ప్రియురాలిపై పగబట్టిన ఓ ప్రియుడు ఆమెను సజీవంగా పూడ్చి పెట్టాడు. ఆమె కళ్లకు గంతలు కట్టి, కేబుళ్లతో చుట్టి, సజీవంగా పాతిపెట్టాడు. ఈ ఘటనలో భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల జాస్మిన్ కౌర్ ఆస్ట్రేలియాలో నర్సింగ్ కోసం వెళ్లింది. అక్కడ ఆమెకు తారిక్ జోత్ తో పరిచయం ఏర్పడి, ప్రేమకు దారి తీసింది. కొన్నాళ్లకు అతని ప్రవర్తనలో మార్పును గమనించిన జాస్మిన్ అతడిని దూరం పెట్టింది. దీనిని జీర్ణించుకోలేని తారిక్ ఆమెపై పగ పెంచుకున్నాడు.

ఆమెను నార్త్ పాలింప్టన్ ప్రాంతం నుండి కిడ్నాప్ చేసి, అక్కడి నుండి ఫ్లిండర్స్ రేంజెస్ కు తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమె కళ్లకు గంతలు కట్టి, శరీరాన్ని కేబుళ్లతో చుట్టి, సజీవంగా పాతిపెట్టాడు. ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగింది. ఇది వెంటనే వెలుగులోకి రాలేదు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో జాస్మిన్ ను తారిక్ హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తారిక్ కోర్టులో తన తప్పును అంగీకరించాడు. జాస్మిన్ ను పాతిపెట్టిన ప్రదేశం నుండి మృతదేహాన్ని వెలికి తీయగా, పోస్టుమార్టం నివేదికలో అతను చంపిన తీరు బయటకు వచ్చింది. ఈ కేసును కోర్టు విచారిస్తోంది.
Australia
India
woman

More Telugu News