OTT: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న కంటెంట్ ఇదే!

  • ఈ వారం  భారీ సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ ల రిలీజ్
  • సిద్ధార్థ్ హీరోగా వచ్చిన టక్కర్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్
  • ముగ్గురు మహిళల కథాంశంతో స్వీట్ కారం కాఫీ
  • నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
OTT content that releases in this week

సినిమా థియేటర్లకు ప్రత్యామ్నాయంగా, అంతకుమించి వినోదం పంచుతున్న ఓటీటీ వేదికల్లో నిత్యం ఏదో ఒక సినిమానో, వెబ్ సిరీసో రిలీజ్ అవుతుంటుంది. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడే అనేక ఓటీటీ వేదికలు వీక్షకులకు కావాల్సినంత ఎంటర్టయిన్ మెంట్ అందిస్తున్నాయి. 

అన్ని వర్గాల వారికి తగినట్టుగా ఉండడం, సెన్సార్ ప్రమేయం లేని కంటెంట్ కావడంతో ఓటీటీల హవా మూడు సినిమాలు, ఆరు వెబ్ సిరీస్ లు అన్నట్టుగా కొనసాగుతోంది. కాగా, ఈ వారం కూడా ఓటీటీల్లో కొత్త కంటెంట్ సందడి చేయనుంది. పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


టక్కర్- నెట్ ఫ్లిక్స్ లో జులై 7 నుంచి స్ట్రీమింగ్. సిద్ధార్థ్, దివ్యాన్ష జంటగా జి.క్రిష్ దర్శకత్వంలో టక్కర్ తెరకెక్కింది.

స్వీట్ కారం కాఫీ- ఇది వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్ లో నేటి నుంచి అందుబాటులో ఉంటుంది. సీనియర్ నటి లక్ష్మి, మధుబాల, శాంతి చంద్రన్ నటించారు. 

అధురా- ఇది హిందీ వెబ్ సిరీస్. జులై 7 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఐబీ 71- ఇది స్పై థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది. విద్యుత్ జమ్వాల్, విశాల్ జెత్వా ముఖ్యపాత్రలు పోషించారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చినే ఐబీ 71 రేపటి నుంచి డిస్నీ హాట్ స్టార్ ప్లస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 

ద హారర్ ఆఫ్ డోలోరెస్ రోచ్- ఇది ఇంగ్లీష్ వెబ్ సిరీస్. దీన్ని జులై 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.

తర్లా- ఇది బాలీవుడ్ సినిమా. జీ5లో జులై 7 నుంచి వీక్షించవచ్చు.

ఫర్హానా- జులై 7 నుంచి స్ట్రీమింగ్ కానున్న చిత్రం... తమిళం, తెలుగులో స్ట్రీమింగ్

ఇక నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోనూ ఈ వారం భారీ సందడి కనిపించనుంది. 

ద లింకన్ లాయర్- వెబ్ సిరీస్ సీజన్-2 నేటి నుంచి స్ట్రీమింగ్
డీప్ ఫేక్ లవ్- ఇది ఇంగ్లీష్ రియాలిటీ షో. జులై 7 నుంచి స్ట్రీమింగ్
ద ఔట్ లాస్- ఈ ఇంగ్లీష్ చిత్రం జులై 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ద పోప్స్ ఎగ్జార్సిస్ట్స్- ఈ ఇంగ్లీష్ చిత్రం జులై 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

జియో సినిమాలో జులై 7 నుంచి బ్లైండ్ (హిందీ సినిమా), జులై 8 నుంచి ఉనాద్ (హిందీ సినిమా) అందుబాటులో ఉండనున్నాయి. 

More Telugu News