Tirumala: శ్రీవారి బ్రేక్ దర్శన టికెట్లు అధిక ధరలకు విక్రయం... టీటీడీ ఉద్యోగిని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు

  • తిరుమలలో అక్రమ టికెట్ల దందా
  • ఎమ్మెల్సీ సిఫారసు లేఖలపై జారీ చేసే బ్రేక్ దర్శన టికెట్లు అధిక ధరలకు అమ్ముకుంటున్న ఉద్యోగి 
  • హైదరాబాద్ భక్తులకు రూ.36 వేలకు విక్రయం
Vigilance dept nobs an employee who sold break darshan tickets for high prices in Tirumala

తిరుమలలో మరో అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ సిఫారసు లేఖలపై జారీ చేసే బ్రేక్ దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది విచారణ జరిపారు. ఓ టీటీడీ ఉద్యోగి అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ ఉద్యోగి హైదరాబాద్ భక్తులకు శ్రీవారి బ్రేక్ దర్శన టికెట్లను రూ.36 వేలకు విక్రయించినట్టు వెల్లడైంది. బ్రేక్ దర్శన టికెట్ల విక్రయాలపై అనుమానం వచ్చిన టీటీడీ విజిలెన్స్ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని భక్తులను విచారించారు. సదరు టీటీడీ ఉద్యోగి ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్టు నిర్ధారించారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరపనున్నట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు.

More Telugu News