AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరావుకు భారీ ఊరట.. సీఎస్ ఉత్తర్వులను కొట్టేసిన హైకోర్టు

  • ఏబీ వెంకటేశ్వరరావు విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించిన చీఫ్ సెక్రటరీ
  • ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వెంకటేశ్వరరావు
  • విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం
AB Venkateswara Rao gets big relief in AP High Court

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆర్జిత సెలవులపై విదేశాలకు వెళ్లేందుకు ఆయనకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. ఏబీవీకి అనుమతిని నిరాకరిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వును హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో ఆయన విదేశాలకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. 

తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని సీఎస్ కు ఏబీ వెంకటేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన విదేశీ పర్యటనకు అనుమతిని ఇచ్చేందుకు సీఎస్ నిరాకరించారు. దీంతో, ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఏబీవీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News