Thirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో అపశ్రుతి

  • ఆలయ మహాద్వారం వద్ద ట్రాలీ నుంచి కింద పడిపోయిన హుండీ
  • పరకామణికి తరలిస్తుండగా ఘటన..
  • కొద్దిసేపు భక్తులను నిలిపేసిన టీటీడీ సిబ్బంది
  • పడిపోయిన కానుకలు హుండీలోకి వేసి తరలింపు
hundi fallen in thirumala venkateshwara swami temple

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయ మహాద్వారం వద్ద స్వామివారి హుండీ ట్రాలీ నుంచి కింద పడిపోయింది. దీంతో హుండీలో నుంచి కానుకలు కింద పడిపోయాయి. ఆలయం నుంచి రోజువారి హుండీలు పరకామణికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.

వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది.. మహాద్వారం వద్ద దర్శనానికి వెళ్లే భక్తులను కొద్దిసేపు నిలిపివేశారు. కింద పడిపోయిన కానుకలను తిరిగి హుండీలోకి వేశారు. తర్వాత హుండీని ట్రాలీలో నుంచి లారీలోకి ఎక్కించి, అక్కడి నుంచి పరకామణికి తరలించారు.

మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

More Telugu News