Uttar Pradesh: గర్భిణికి ఏసీ గది ఏర్పాటు చేయలేదని అత్తింటివారిపై పుట్టింటి వారి దాడి

Pregnant womans family thrashes in laws over non AC delivery room
  • ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన
  • గర్భిణిని ఆసుపత్రిలో చేర్చిన అత్తింటి వారు
  • ఏసీ లేని గదిలో యువతి ప్రసవించిందని తెలిసి తల్లిదండ్రుల ఆగ్రహం
  • వియ్యంకుడితో వాగ్వాదం, చివరకు చేయి చేసుకున్న వైనం
  • ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు
గర్భిణికి ఆసుపత్రిలో ఏసీ గది ఏర్పాటు చేయలేదంటూ అత్తింటి వారిపై ఆమె పుట్టింటి వారు దాడికి తెగబడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, ఇటీవల ఓ గర్భిణిని ఆమె అత్తింటి వారు బారాబంకీ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను చూసేందుకు వచ్చిన పుట్టింటి వారు మహిళ ఏసీ లేని గదిలోనే ప్రసవించిందని తెలుసుకుని అత్తింటి వారితో గొడవకు దిగారు. ఏసీ గది ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ గర్భిణి తల్లిదండ్రులు తమ వియ్యంకుడు రాజ్‌కుమార్‌తో గొడవపడ్డారు. చివరకు ఆయనపై చేయి చేసుకున్నారు. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో వారు విచారణ జరుపుతున్నారు.
Uttar Pradesh
Viral Videos

More Telugu News