Naga Shaurya: 'రంగబలి' నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్!

  • యూత్ ఫుల్ ఎంటర్టయినర్ గా 'రంగబలి' 
  • కథానాయికగా యుక్తి తరేజా పరిచయం
  • ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న బాణీలు 
  • ఈ నెల 7వ తేదీన థియేటర్లకు సినిమా
Rangabali Movie Song Released

నాగశౌర్య హీరోగా రూపొందిన 'రంగబలి' సినిమా, ఈ నెల 7వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఎస్ ఎల్ వీ సినిమా వారు నిర్మించిన ఈ సినిమాకి పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించాడు. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్  .. కామెడీ ప్రధానంగా సాగే కథ ఇది. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ వీడియో సాంగును రిలీజ్ చేశారు. 'పద పద ప్రేమ మొదలెడదామా ..' అంటూ ఈ పాట సాగుతోంది. హీరో - హీరోయిన్ లపై ఈ పాటను చిత్రీకరించారు. ఇది రొమాంటిక్ సాంగ్ .. సాహిత్యం కూడా అందుకు తగినట్టుగానే ఉంది. 

పవన్ సీహెచ్ స్వరపరిచిన ఈ పాట .. బీట్ పరంగా యూత్ ను ఆకట్టుకునేలానే ఉంది. ఈ సినిమాతో యుక్తి తరేజా కథానాయికగా పరిచయమవుతోంది. ఈ పాటలో గ్లామరస్ గా మెరిసిన ఆమె, ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకుంది. ఇక సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న నాగశౌర్యకి, ఈ సినిమాతో ఆ ముచ్చట తీరుతుందేమో చూడాలి.

More Telugu News