Jagan: అమిత్ షాతో ముగిసిన జగన్ భేటీ.. 45 నిమిషాల పాటు కొనసాగిన సమావేశం

Jagan meeting with Amit Shah ended
  • రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించిన జగన్
  • కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం
  • ఢిల్లీలో జగన్ కు స్వాగతం పలికిన విజయసాయి, మిథున్ రెడ్డి
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు, పోలవరం ప్రాజెక్ట్ నిధులు తదితర అంశాలపై జగన్ చర్చించినట్టు తెలుస్తోంది. 45 నిమిషాల పాటు కొనసాగిన వీరి భేటీ ఇప్పుడే ముగిసింది. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రిని కలుస్తారు. అంతకుముందు ఢిల్లీ విమానాశ్రయంలో జగన్ కు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు స్వాగతం పలికారు.
Jagan
YSRCP
Amit Shah
BJP

More Telugu News