Balakrishna: 'భగవంత్ కేసరి' క్లైమాక్సులో బాలయ్య!

  • భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'భగవంత్ కేసరి'
  • కెరియర్ పరంగా బాలయ్యకి 108వ సినిమా 
  • ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న తమన్ సంగీతం 
  • దసరాకి ప్రేక్షకుల ముందుకు 
Bhagavanth Kesari Movie Update

బాలకృష్ణ 108వ సినిమాగా 'భగవంత్ కేసరి' రూపొందుతోంది. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. టైటిల్ ను ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరగడం మొదలైంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. బాలకృష్ణతో పాటు ముఖ్య పాత్రధారులంతా పాల్గొంటూ ఉండగా, క్లైమాక్స్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారట. బాలయ్య మార్కు మాస్ యాక్షన్ తో ఈ క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇందుకోసం భారీ మొత్తమే ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు. 

ఈ సినిమాలో బాలయ్య సరసన నాయికగా కాజల్ కనిపించనుంది. ఇక ఆయన కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తోంది. అర్జున్ రాంపాల్ .. శరత్ కుమార్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 'దసరా' పండుగ సందర్భంగా ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేయనున్నారు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 

More Telugu News