Priyadarshi: 'బలగం' సినిమాకి మాత్రమే సాధ్యమైన రికార్డు!

  • మార్చి 3వ తేదీన విడుదలైన సినిమా 
  • విడుదలకి ముందు కనిపించని బజ్ 
  • ఆ తరువాత తగ్గని వసూళ్లు - ఆగని అవార్డులు
  • ఈ మధ్య కాలంలో ఈ సినిమా ఓ సంచలనం
Balagam Movie Update

ఒక సినిమా చిన్న సినిమానా .. పెద్ద సినిమానా అనేది ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ కాదు .. అది సాధించిన వసూళ్లు నిర్ణయిస్తాయి అనే విషయాన్ని మరోసారి నిరూపించిన సినిమానే 'బలగం'. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి వేణు దర్శకత్వం వహించాడు. మార్చి 3వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. 

విడుదలకు ముందు ఎలాంటి బజ్ లేదు. కమెడియన్ గా వేణు గురించి తెలిసిన వారు, ఈ సినిమాను లైట్ తీసుకున్నారు. కానీ తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఆ రోజు నుంచి వసూళ్లను .. ఆదరణను పెంచుకుంటూ పోయింది. ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అనే టాక్ రావడంతో, గ్రామాల్లో తెరలు కట్టి మరీ ఫ్రీ షోలు వేశారు. ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి ఈ స్థాయి ఆదరణ లభించడం మనకి కనిపించదు. 

అలాంటి ఈ సినిమా 100 సెంటర్స్ లో 100 రోజులను పూర్తి చేసుకుంది. ఈ రెండు విషయాలు అరుదుగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ సినిమా 100 ఇంటర్నేషనల్ అవార్డ్స్ ను తెచ్చుకోవడం అనితర సాధ్యమైన రికార్డునే. రీసెంట్ గా ఈ విషయాన్ని వేణు ట్విట్టర్ ద్వారా సినీప్రేమికులతో పంచుకున్నాడు. బలగానికి అవార్డులు ఇప్పుడు మరింత బలాన్ని తెచ్చాయన్నమాట. 

More Telugu News