Parvesh Shukla: వీడియో వైరల్ కావడంతో స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం.. గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్

  • మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఘటన
  • నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్లా ప్రతినిధి నిందితుడు
  • నిందితుడు తనకు తెలుసు కానీ ప్రతినిధి కాదన్న ఎమ్మెల్యే
Madhya Pradesh man Pravesh Shukla who urinated on tribal labourer arrested

గిరిజన కూలీపై బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో పర్వేష్ శుక్లా అనే వ్యక్తి గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టిలో పడడంతో నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజాగా నిందితుడు పర్వేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్లా ప్రతినిధి అని, అందుకే చర్యలు తీసుకోవడంలో వెనకాడుతున్నారంటూ నిన్న ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎమ్మెల్యేతో నిందితుడు కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశాయి. అయితే, కేదార్ శుక్లా ఈ ఆరోపణలను ఖండించారు. అతడు తనకు ప్రతినిధి కాదని, కాకపోతే అతడు తనకు తెలుసని చెప్పుకొచ్చారు. నిందితుడు పర్వేష్ తండ్రి రమాకాంత్ శుక్లా మాత్రం తన కుమారుడు ఎమ్మెల్యే కేదార్ ప్రతినిధేనని, అందుకే ఆయనను టార్గెట్ చేసుకున్నారని చెప్పడం గమనార్హం.

More Telugu News