metro train: హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డ్.. నిన్న ఎంతమంది ప్రయాణించారంటే..!

  • జులై 3న మెట్రో రైలులో 5 లక్షల 10 వేలమంది ప్రయాణం
  • నాగోల్ నుండి హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ నుండి కూకట్‌పల్లి రూట్లలో అధిక సంఖ్యలో ప్రయాణం
  • ప్రారంభం నుండి 40 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చిన మెట్రో రైలు
Hyderabad metro record with over 5 lakh passengers on monday

హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డును నమోదు చేసింది. జులై 3న మెట్రో రైలులో 5 లక్షల 10 వేలమంది ప్రయాణించారు. ఒక్కరోజే ఇంత భారీస్థాయిలో ప్రయాణికులు ట్రావెల్ చేయడం సరికొత్త రికార్డ్. నాగోల్ నుండి హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ నుండి కూకట్‌పల్లి రూట్లలో ఎక్కువమంది ప్రయాణించారు. ఇప్పటి వరకు హైద‌రాబాద్ మెట్రో రైలు 40 కోట్లమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది.

2017 నవంబర్ 29న ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోలో గత కొన్ని రోజులుగా ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆఫీసు వేళ‌ల్లో మెట్రోలో జ‌నం ర‌ద్దీగా ఉంటున్నారు. అమీర్‌పేట జంక్ష‌న్ ఉద‌యం, సాయంత్రం కిక్కిరిసిపోతోంది.

More Telugu News