Virat Kohli: హర్భజన్ సింగ్ ఎంచుకున్న ప్రపంచ టాప్ 5 టెస్ట్ క్రికెటర్లు వీరే...!

Only two Indians in Harbhajans list of best current five Test cricketers in world
  • భజ్జీ జాబితాలో చోటులేని కోహ్లీ, రోహిత్, అశ్విన్
  • భారత్ నుండి రిషబ్ పంత్, జడేజా
  • ఆస్ట్రేలియా నుండి ఇద్దరు, ఇంగ్లండ్ నుండి ఒకరు
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కు  ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ క్రికెట్ లో ఐదుగురు బెస్ట్ ప్లేయర్స్ ఎవరు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి భజ్జీ ఐదుగురు క్రికెటర్లను ఎంచుకున్నాడు. ఇందులో విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ కు చోటు దక్కలేదు! ఐదుగురు బెస్ట్ టెస్ట్ ప్లేయర్స్ ఎవరు? స్కిల్స్ మాత్రమే కాకుండా గేమ్ ఛేంజర్స్, మ్యాచ్ విన్నర్లు, కీలక సమయాల్లో బాగా ఆడేవారిని పరిగణలోకి తీసుకొని చెప్పండి? అంటూ ఓ ట్విట్టర్ యూజర్ ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నకు భజ్జీ సమాధానం ఇచ్చాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు నాథన్ లయన్, స్టీవ్ స్మిత్, భారత ఆటగాడు రిషబ్ పంత్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను ఎంచుకున్నాడు. భజ్జీ ఎంచుకున్న టాప్ ఫైవ్ ప్లేయర్స్ లో కోహ్లీతో పాటు రోహిత్, నెంబర్ 1 టెస్ట్ బౌలర్ అశ్విన్ కు చోటు దక్కలేదు.
Virat Kohli
Harbhajans singh
Cricket

More Telugu News