Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఇన్‌స్టాకు గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్

Millions of followers for pawan Kalyan insta account
  • మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన జనసేనాని
  • ఖాతా ప్రారంభించిన కాసేపటికే వెరిఫైడ్ 
  • సింగిల్ పోస్ట్ లేకుండానే పెరిగిన ఫాలోవర్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. నిన్నటి వరకు ఫేస్‌బుక్, ట్విట్టర్ లో మాత్రమే ఉన్న జనసేనాని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టాడు. ఉదయం ఆయన ఖాతా తెరిచిన కాసేపటికే వెరిఫైడ్ లభించింది. ఈ ఖాతాను ప్రారంభించిన గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్ దాటేశారు. అంటే సింగిల్ పోస్ట్ లేకుండానే ఫాలోవర్స్ పెరిగిపోయారు. ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా ఆయన రాజకీయాలకు సంబంధించిన విషయాలను ఎక్కువగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇన్‌స్టా వేదికగా రాజకీయాలతో పాటు సినిమా విశేషాలను కూడా షేర్ చేయనున్నారని తెలుస్తోంది. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో... జై హింద్ అనే స్లోగన్ ను చేర్చారు.
Pawan Kalyan
Janasena

More Telugu News