Kiran Kumar Reddy: కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ జాతీయ స్థాయిలో కీలక పదవి

Kiran Kumar Reddy appointed as member of national executive committee
  • జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కిరణ్ కుమార్ రెడ్డి నియామకం
  • తక్షణమే నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు
  • ఇటీవలే బీజేపీలో చేరిన ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ హైకమాండ్ ఆయనకు తగిన బాధ్యతలను అప్పగించింది. బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఆయనను నియమించింది. తద్వారా ఆయన సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోనుంది. కిరణ్ కుమార్ రెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది.
Kiran Kumar Reddy
BJP
National Executive Committee Member

More Telugu News