Pawan Kalyan: ఇన్స్టాగ్రామ్ లో పవన్ ప్రభంజనం.. ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే...!

Pawan Kalyan followers on Instagram reaches 9 lakh on first day
  • అల్లూరి పుట్టిన రోజు సందర్భంగా ఇన్స్టాలోకి పవన్ ఎంట్రీ
  • పవన్ ఎంట్రీతో ఇన్స్టా షేక్
  • గంటగంటకూ లక్షలాదిగా పెరిగిపోతున్న ఫాలోయర్లు
ఇన్స్టాగ్రామ్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ షేక్ చేస్తున్నారు. సోషల్ మీడియా చరిత్రలోనే పవన్ కనీవినీ ఎరుగని రికార్డును క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు పుట్టినరోజును పురస్కరించుకుని పవన్ కల్యాణ్ ఇన్స్టాగ్రామ్ లో ఖాతాను ఓపెన్ చేశారు. అకౌంట్ క్రియేట్ చేసిన వెంటనే ఇన్స్టా షేక్ అయింది. గంటగంటకూ ఆయనను ఫాలో అవుతున్న వారి సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు 9.16 లక్షల మంది ఇన్స్టాలో పవన్ ను ఫాలో అవుతున్నారు. తొలి రోజు ఆయనను ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియన్ మార్క్ ను దాటబోతోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే పవన్ కేవలం ఖాతా మాత్రమే తెరిచారు. ఇంత వరకు ఇన్స్టాలో ఒక్క పోస్ట్ కూడా చేయలేదు.  
Pawan Kalyan
Janasena
Instagram

More Telugu News